జోకో.. కాంస్యం కూడా పాయె

ABN , First Publish Date - 2021-08-01T09:27:29+05:30 IST

గోల్డెన్‌ స్లామ్‌ ఎలాగూ దక్కలేదు..కనీసం కాంస్య పతకమైనా గెలుస్తాడనుకుంటే టాప్‌సీడ్‌ జొకోవిచ్‌ ఆ పోరులోనూ నిరాశపరిచాడు...

జోకో.. కాంస్యం కూడా పాయె

గోల్డెన్‌ స్లామ్‌ ఎలాగూ దక్కలేదు..కనీసం కాంస్య పతకమైనా గెలుస్తాడనుకుంటే టాప్‌సీడ్‌ జొకోవిచ్‌ ఆ పోరులోనూ నిరాశపరిచాడు. కరెనో బుస్టా (స్పెయిన్‌)తో జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో జొకో 4-6, 7-6 (6), 3-6తో ఓడాడు. మ్యాచ్‌ ఆసాంతం తీవ్ర అసహనంగా కనిపించిన జొకో రెండుసార్లు బ్యాట్‌ను విసిరికొట్టాడు. అనంతరం స్జొటానొవిక్‌తో కలిసి మిక్డ్‌డ్‌ డబుల్స్‌ కాంస్య పతక మ్యాచ్‌లో నొవాక్‌ ఆడాల్సి ఉంది. కానీ భుజం గాయంతో ఆ మ్యాచ్‌ నుంచి వైదొలుతున్నట్టు జొకో ప్రకటించాడు. 

Updated Date - 2021-08-01T09:27:29+05:30 IST