మధ్యాహ్న భోజన పథకాన్నిస్వచ్ఛంద సంస్థలకు అప్పగించవద్దు

ABN , First Publish Date - 2021-10-22T04:57:02+05:30 IST

మధ్యాహ్న భోజన పథకాన్నిస్వచ్ఛంద సంస్థలకు అప్పగించవద్దు

మధ్యాహ్న భోజన పథకాన్నిస్వచ్ఛంద సంస్థలకు అప్పగించవద్దు
అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న నాయకులు, తదితరులు

  • కార్మిక సంఘాల డిమాండ్‌

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి) : మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్‌, సీఐటీయూలు  డిమాండ్‌ చేశాయి.  ఈ మేరకు యూనియన్‌ నాయకులు  గురువారం జిల్లా అదనపు కలెక్టర్‌ తిరుపతిరావును కలిసి వినతిపత్రం అందచేశారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో అనేక మండలాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించారని దీనివల్ల ప్రస్తుతం ఈ పథకం అమల్లో భాగస్వాములుగా ఉన్న కార్మికులు రోడ్డునపడతారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పథకం కింద జిల్లాలో సుమారు 2వేల మంది 19ఏళ్ల నుంచి పనిచేస్తున్నారని చెప్పారు. వీరికి కనీస గౌరవ వేతనం కూడా అందించడంలేదని కేవలం రూ.1000 మాత్రమే అందిస్తున్నారని తెలిపారు. పీఎఫ్‌, ఈఎ్‌సఐ లాంటి సౌకర్యాలు లేకపోయినా ప్రభుత్వ స్కూళ్లలో తక్కువ గౌరవ వేతనానికే పనిచేస్తున్నారని తెలిపారు. వీరంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినవారేనని, ఈ పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇస్తే మహిళలంతా ఉపాధి లేక వీధిని పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందువల్ల తక్షణమే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు స్వప్న, జిల్లా కార్యదర్శి సీహెచ్‌ ప్రవీణ్‌, జిల్లా గౌరవ అధ్యక్షులు కవిత, సీఐటీయూ జిల్లా నాయకులు కృష్ణ, ఎల్లేష్‌, బుగ్గరాములు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-22T04:57:02+05:30 IST