మాస్కులడిగితే డాక్టరును కొట్టారు: లోక్‌సభలో గల్లా

ABN , First Publish Date - 2020-09-21T07:57:57+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ సర్కారు కరోనా కట్టడిలో పూర్తిగా విఫలమైందని, అందువల్లే రాష్ట్రంలో కేసులు భారీగా పెరిగాయని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత,

మాస్కులడిగితే డాక్టరును కొట్టారు: లోక్‌సభలో గల్లా

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ సర్కారు కరోనా కట్టడిలో పూర్తిగా విఫలమైందని, అందువల్లే రాష్ట్రంలో కేసులు భారీగా పెరిగాయని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. ఆదివారం లోక్‌సభలో కరోనా పరిస్థితిపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.


‘ఏపీలో మాస్కులు అడిగిన ఒక దళిత డాక్టరును పోలీసులు కొట్టారు. మతిస్థితమితం లేదని ముద్ర వేశారు. నా నియోజకవర్గంలోనే.. బెడ్ల సంఖ్య పెంచాలని సమీక్ష సమావేశంలో మరో దళిత డాక్టరు విజ్ఞప్తి చేయగా జిల్లా కలెక్టరు ఆయనను బయటికి గెంటించారు. అరెస్టు చేయిస్తానని బెదించారు. పీపీఈ కిట్లు అందించడం లేదని తెనాలిలో నర్సులు, డాక్టర్లు విధులు బహిష్కరించారు. ఇవి కొన్ని ఉదాహరణలే.. ఇలాంటివి చాలా జరిగాయి’’ అని సభ దృష్టికి తీసుకొచ్చారు.


Updated Date - 2020-09-21T07:57:57+05:30 IST