కోవిడ్ సెంటర్‌లో అగ్నిప్రమాదంపై ఫస్ట్ టైం స్పందించిన రమేష్

ABN , First Publish Date - 2020-08-10T21:43:25+05:30 IST

విజయవాడ నగరంలోని స్వర్ణ ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం విదితమే.

కోవిడ్ సెంటర్‌లో అగ్నిప్రమాదంపై ఫస్ట్ టైం స్పందించిన రమేష్

అమరావతి : విజయవాడ నగరంలోని స్వర్ణ ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం విదితమే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఇప్పటికే ఈ ప్రమాదంపై ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. మరోవైపు స్వర్ణ ప్యాలెస్, రమేష్ ఆస్పత్రి యాజమాన్యాలపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు బెజవాడ పోలీసులు మీడియాకు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదలుకుని ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ ఘటనపై స్పందించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు అరకోటి పరిహారం ఇస్తున్నట్లు ఘటన జరిగిన కొద్దిసేపటికే వైఎస్ జగన్ ప్రకటించారు.


దురదృష్టకరం..

కాగా ఈ మొత్తం వ్యవహారంపై రమేష్ హాస్పటల్ చైర్మన్ డాక్టర్ రమేష్ బాబు స్పందించారు. క్వారంటైన్ సెంటర్‌లో జరిగిన సంఘటనలో పది మంది మరణించడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక, పోలీసు, ఇతర అధికారులు స్పందించినందుకు ఈ సందర్భంగా రమేష్ కృతజ్ఞతలు తెలిపారు.


ఆరోగ్య పరిస్థితి మాత్రమే..!

మా ఆస్పత్రి నుంచి టెలి మెడిసిన్ ద్వారా హౌస్ క్వారంటైన్‌లో ఉన్న వారికి చికిత్స అందించాం. కలెక్టర్, డీఎంహెచ్ఓ ఇన్ పేషెంట్లను చేర్చుకునేందుకు సిద్దం కావాలని సమావేశంలో చెప్పారు. రోగులు పెరుగుతుండటంతో, తమ పేషెంట్లకు కూడా కరోనా సోకడంతో వారు ఫోన్లు చేశారు. ఆ తర్వాత క్వారంటైన్ సెంటర్ నడిపేందుకు అనుమతి కావాలని కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నాం. అనుమతి ఇచ్చిన తర్వాత రెండు హోటల్స్‌లో క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశాం. హోటల్ యాజమాన్యానికి, మాకు మధ్య ఒప్పందం ఉంది. హోటల్ నిర్వహణను, ఇతర సౌకర్యాలను హోటల్ యాజమాన్యం చూసుకుంటుంది. మేం కోవిడ్ పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని మాత్రమే చూసుకుంటాం. 200 మందికి పైగా పేషెంట్లు క్వారంటైన్ సెంటర్‌లో చికిత్స పొందారు. వీరికి ట్రీట్మెంట్ ఇచ్చే సిబ్బందికి మేము తగిన శిక్షణ ఇచ్చాము. చికిత్స ఎలా చేయాలి..? క్వారంటైన్ సెంటర్ నుంచి ఆసుపత్రికి ఎప్పుడు తరలించాలి..?, ఎప్పుడు డిశ్చార్జి చేయాలి..? అనే అంశాలపై శిక్షణ ఇచ్చాంఅని రమేష్ బాబు చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-08-10T21:43:25+05:30 IST