Abn logo
Sep 15 2021 @ 11:26AM

నేటి నుంచి కృష్ణా జిల్లాలో డాక్టర్ల సమ్మె

విజయవాడ: కృష్ణా జిల్లాలో నేటి నుంచి డాక్టర్ల సమ్మె జరగనుంది. డిమాండ్ల సాధనకు జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ విధులను బహిష్కరిస్తున్నారు. బాకీపడ్డ ఐదు నెలల జీతాలు, వేతనాల పెంపు వెంటనే చెయాలని డిమాండ్ చేశారు. 200 మంది జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ కొవిడ్ హాస్పిటల్స్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. జీతాలు ఇచ్చే వరకూ విధులకు హాజరుకాబోమని జీడీ మెడికల్ ఆఫీసర్స్ స్పష్టం చేస్తున్నారు.