హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడటం ఆపేశా: ట్రంప్

ABN , First Publish Date - 2020-05-25T20:57:21+05:30 IST

హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్‌ను వాడటం ఆపేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్

హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడటం ఆపేశా: ట్రంప్

వాషింగ్టన్: హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్‌ను వాడటం ఆపేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆదివారం ఓ టీవీ ప్రోగ్రామ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ మాట చెప్పారు. ‘హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను వాడటం ఆపేసా.. అయినా మీ ముందు ఆరోగ్యంగానే ఉన్నా చూడండి’ అంటూ ట్రంప్ చెప్పారు. కరోనా నివారణకు తాను హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్‌ను వాడుతున్నట్టు ట్రంప్ గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు నుంచే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ కరోనాను నయం చేస్తుందంటూ ఆయన చెబుతూ వచ్చారు. అంతేకాకుండా భారత ప్రభుత్వం నుంచి కొన్ని లక్షల టాబ్లెట్లను ఎగుమతి చేయించుకున్నారు. ట్రంప్ వ్యాఖ్యల తర్వాత ప్రపంచవ్యాప్తంగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌కు డిమాండ్ పెరిగింది. అమెరికాతో పాటు అనేక దేశాలు భారత్‌ నుంచి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఎగుమతి చేసుకున్నాయి. అయితే అమెరికాలో వేల మంది పేషంట్లపై హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ప్రయోగించగా.. ఎటువంటి ఉపయోగం కలగలేదని తేలింది. పైగా హైడ్రాక్సీక్లోరోక్విన్ ప్రయోగించిన తర్వాత పేషంట్లలో గుండె సమస్యలు పెరగడం గుర్తించినట్టు వైద్యులు తెలిపారు. 

Updated Date - 2020-05-25T20:57:21+05:30 IST