Afghan Crisis:యూఎస్ మిలటరీ స్థావరాలపై బాంబులు వేయాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-08-21T15:28:45+05:30 IST

అమెరికా మిలటరీ స్థావరాలపై బాంబులు వేయాల్సిందంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. ఆయన మాటలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతు

Afghan Crisis:యూఎస్ మిలటరీ స్థావరాలపై బాంబులు వేయాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్: అమెరికా మిలటరీ స్థావరాలపై బాంబులు వేయాల్సిందంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. ఆయన మాటలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి మండిపడ్డారు. అఫ్ఘనిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బైడెన్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. బైడెన్ ప్రభుత్వ వైఫల్యం వల్లే అఫ్ఘానిస్థాన్.. తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే అఫ్ఘానిస్థాన్‌లో చిక్కుకున్న అమెరికా పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు బైడెన్ ప్రభుత్వానికి ట్రంప్ ఓ సలహా ఇచ్చారు.


ఈ క్రమంలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మొదటగా అమెరికా పౌరులను, ఆ తర్వాత పరికారలను తరలించిన అనంతరం అమెరికా సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాల్సింది. చివరగా మిలటరీని వెనక్కి రప్పించాల్సింది’ అంటూ వ్యాఖ్యానించారు. కాగా.. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. మాజీ అధ్యక్షుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైనికులను ముందుగా తరలించకుండా సైనిక స్థావరాలపై బాంబులు వేయాలంటూ సూచించడం ఏంటని ప్రశ్నిస్తూనే.. ఇదేం చెత్త సలహా అంటూ విమర్శిస్తున్నారు. 

Updated Date - 2021-08-21T15:28:45+05:30 IST