వృద్ధాశ్రమాలకు విరాళాలు

ABN , First Publish Date - 2020-03-30T10:23:03+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ ఈ నెల 26న ప్రచురించిన ‘పండుటాకులను కాపాడుకుందాం’ కథనంపై ప్రభుత్వం స్పందించింది. ఈ కథనంతో

వృద్ధాశ్రమాలకు విరాళాలు

ఆశ్రమాల్లో సమస్యలపై ఉన్నతాధికారుల ఆరా

శానిటైజర్లు, నిత్యావసరాలు అందజేసిన దాతలు

ఓల్డేజ్‌ హోమ్స్‌ ఫోరం అధ్యక్షురాలు నాగచంద్రిక

హైదరాబాద్‌ సిటీ, మార్చి29 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ ఈ నెల 26న ప్రచురించిన ‘పండుటాకులను కాపాడుకుందాం’ కథనంపై ప్రభుత్వం స్పందించింది. ఈ కథనంతో స్త్రీ, శిశు, దివ్యాంగుల, వయోధికుల సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు తెలంగాణ ఓల్డేజ్‌ హోమ్స్‌ ఫోరం అధ్యక్షురాలు కిన్నెర నాగచంద్రికను సంప్రదించారు. ఆశ్రమాల వెతలపై అడిగి తెలుసుకున్నారు. పలు ఆశ్రమాలకు తగిన సాయం అందించేందుకు చర్యలు తీసుకొంటామన్నారు. ఈ విషయాన్ని నాగచంద్రిక తెలిపారు. కొందరు దాతలు ఆశ్రమాలకు శానిటైజర్లు, నిత్యావసరాలు, మాస్కులను విరాళంగా అందించారని చెప్పారు. ‘‘ఆపదవేళ పత్రికలు అత్యవసరం అనడానికి ‘ఆంధ్రజ్యోతి’ వల్ల వృద్ధాశ్రమాలకు అందిన సాయమే నిదర్శనం. కృతజ్ఞతలు’’ అన్నారు. 

Updated Date - 2020-03-30T10:23:03+05:30 IST