బస్సులెన్ని ఉన్నాయో తెలియదా!

ABN , First Publish Date - 2021-10-18T08:33:34+05:30 IST

వరంగల్‌ విజయగర్జన సభకు జనాన్ని బస్సుల్లో తరలించే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఎన్ని ఉన్నాయంటూ మంత్రి పువ్వాడ అజయ్‌ను సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు.

బస్సులెన్ని ఉన్నాయో తెలియదా!

  • ఆర్టీసీ బస్సుల సంఖ్యపై పువ్వాడను ప్రశ్నించిన సీఎం కేసీఆర్‌
  • డిపోల వారీగా బస్సుల సంఖ్య తెలియదన్న మంత్రి
  • పువ్వాడపై కేటీఆర్‌ సెటైర్లు.. తాను రవాణా మంత్రినన్న అజయ్‌


హైదరాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): రంగల్‌ విజయగర్జన సభకు జనాన్ని బస్సుల్లో తరలించే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఎన్ని ఉన్నాయంటూ మంత్రి పువ్వాడ అజయ్‌ను సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. డిపోల వారీగా ఎవరెవరికి ఎన్ని బస్సులు కావాలో మంత్రి పువ్వాడకు తెలపాలన్నారు. అయితే డిపోలవారీగా బస్సుల సంఖ్యను తెలుసుకునేందుకు మంత్రి.. సభ నుంచి బయటికి వచ్చి అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇంతలోనే.. సీఎం పిలవడంతో మంత్రి లోపలికి వెళ్లారు. ఈసందర్భంగా ‘‘బస్సుల లెక్క చెప్పలేవా?’’ అంటూ పువ్వాడపై కేటీఆర్‌ సెటైర్లు వేశారు. అయితే తాను రవాణా శాఖ మంత్రినని, ఆర్టీసీ నిర్వహణ బాధ్యత ఆర్టీసీ చైర్మన్‌ చూస్తారని అజయ్‌ అన్నారు. 

Updated Date - 2021-10-18T08:33:34+05:30 IST