Advertisement
Advertisement
Abn logo
Advertisement

జీవీఎంసీ కమిషనర్‌గా డాక్టర్ లక్ష్మీశ

విశాఖపట్నం: జీవీఎంసీ నూతన  కమిషనర్‌గా డాక్టర్ లక్ష్మీశ పదవీ భాద్యతలను చేపట్టారు. నూతన కమిషనర్‌కు జీవీఎంసీ అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ విశాఖ సుందరమైన నగరమన్నారు. ఈ నగరంలో పనిచేయడానికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నగర ప్రజలు, జీవీఎంసీ సిబ్బంది ,అన్ని శాఖల సమన్వయంతో పని చేస్తానన్నారు. విశాఖను అభివృద్ధి పథంలో నడిపించడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. నగనరంలో పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని కమిషనర్ లక్ష్మీశ తెలిపారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement