స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌పై డాక్టర్‌ రెడ్డీస్‌ క్లినికల్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2020-10-18T06:39:31+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ వీపై రెండు, మూడో దశల హ్యూ మన్‌ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి డాక్టర్‌ రెడీ ్డస్‌ లేబొరేటరీ్‌సకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది.

స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌పై డాక్టర్‌ రెడ్డీస్‌ క్లినికల్‌ పరీక్షలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవిడ్‌ వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ వీపై  రెండు, మూడో దశల హ్యూ మన్‌ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి  డాక్టర్‌ రెడీ ్డస్‌ లేబొరేటరీ్‌సకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. వివిధ కేంద్రాల్లో నియంత్రిత యాదృచ్ఛిక విధానంలో అధ్యయనాన్ని నిర్వహించనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ వెల్లడించింది.


వ్యాక్సిన్‌ భద్రత, ఇమ్యునోజెనిసిటీ లను కూడా పరిశీలిస్తారు. డీసీజీఐ అనుమతి లభించినందున 10 కోట్ల డోసుల స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ డాక్టర్‌ రెడ్డీ్‌సకు అందుతుంది. భద్రమైన, సమర్థమంతమైన వ్యాక్సిన్‌ తీసుకురావడానికి డాక్టర్‌ రెడ్డీస్‌ కట్టుబడి ఉంది.

స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌పై రెండు, మూడు దశల క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి డీసీజీఐ అనుమతి ఇవ్వడం కీలక పరిణామమని డాక్టర్‌ రెడ్డీస్‌ కో చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జీవీ ప్రసాద్‌ తెలిపారు. 


Updated Date - 2020-10-18T06:39:31+05:30 IST