సెల్జీన్‌తో డాక్టర్‌ రెడ్డీస్‌ వివాదం పరిష్కారం

ABN , First Publish Date - 2020-09-18T06:11:10+05:30 IST

రెవ్లీమిడ్‌ టాబ్లెట్లపై సెల్జీన్‌తో ఉన్న వివాదాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ పరిష్కరించుకుంది...

సెల్జీన్‌తో డాక్టర్‌ రెడ్డీస్‌ వివాదం పరిష్కారం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రెవ్లీమిడ్‌ టాబ్లెట్లపై సెల్జీన్‌తో ఉన్న వివాదాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ పరిష్కరించుకుంది. మల్టిపుల్‌ మైలోమా (ఎంఎం), మైలోడిస్పాలాస్టిక్‌ సిండ్రోమ్స్‌ (ఎండీఎస్‌) చికిత్సకు వినియోగించే లెనలిడోమైడ్‌ ఔషధాన్ని రెవ్లీమిడ్‌ బ్రాండ్‌తో సెల్జీన్‌ విక్రయిస్తోంది. చెల్లించాల్సిన మొ త్తం క్లెయిమ్‌లను చెల్లించినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది. దీంతో 2022 మార్చి తర్వాత పరిమిత పరిమాణంలో అమెరికాలో జనరిక్‌ లెనలిడోమైడ్‌ టాబ్లెట్లను డాక్టర్‌ రెడ్డీస్‌ విక్రయించడానికి సెల్జీన్‌ అంగీకరించింది. బ్రిస్టల్‌ మేయర్స్‌ స్క్విబ్‌కు సెల్జీన్‌ అనుబంధ సంస్థ. ఒప్పందం ప్రకారం 2026, జనవరి తర్వాత పరిమాణ పరిమితి లేకుండా లెనలిడోమైడ్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ విక్రయించుకోవచ్చు. త్వరలోనే లినలిడోమైడ్‌ జనరిక్‌ ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకువస్తామని కంపెనీ తెలిపింది. 

Updated Date - 2020-09-18T06:11:10+05:30 IST