బీఐఆర్‌ఏసీతో డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం

ABN , First Publish Date - 2020-10-30T06:30:31+05:30 IST

భారత్‌లో స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌పై క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి బయోటెక్నాలజీ విభాగానికి చెందిన బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌ (బీఐఆర్‌ఏసీ) సలహాలు, సహాయ సహకారాలను డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ తీసుకోనుంది...

బీఐఆర్‌ఏసీతో డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం

  • స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌పై పరీక్షలు 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): భారత్‌లో స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌పై క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి బయోటెక్నాలజీ విభాగానికి చెందిన బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌ (బీఐఆర్‌ఏసీ) సలహాలు, సహాయ సహకారాలను డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ తీసుకోనుంది. ఇందు కోసం బీఐఆర్‌ఏసీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందానికి అనుగుణంగా బీఐఆర్‌ఏసీకి చెందిన క్లినికల్‌ సెంటర్లను డాక్టర్‌ రెడీ ్డస్‌ వినియోగించుకుంటుంది. వ్యాక్సిన్‌పై ఇమ్యునోజెనిసిటీ పరీక్షలను నిర్వహించడానికి బీఐఆర్‌ఏసీకి చెందిన గుడ్‌ క్లినికల్‌ లేబొరేటరీ ప్రాక్టీస్‌ (జీసీఎల్‌పీ) ల్యాబ్‌లను కూడా వినియోగించుకోనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది.


భారత్‌లో వేగంగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ ఒప్పదం దోహదం చేస్తుందని డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ చైర్మన్‌ సతీశ్‌ రెడ్డి తెలిపారు. భారత్‌లో సుత్నిక్‌  వీ వ్యాక్సిన్‌పై క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి బీఐఆర్‌ఏసీ సలహా భాగస్వామి గా ఉంటుందన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌పై వేగంగా క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకు అనుగుణంగానే డాక్టర్‌ రెడ్డీ్‌సతో బయోటెక్నాలజీ విభాగం చేతులు కలిపిందని డీబీటీ సెక్రటరీ, బీఐఆర్‌ఏసీ చైర్‌పర్సన్‌ రేణు స్వరూప్‌ తెలిపారు. 


Updated Date - 2020-10-30T06:30:31+05:30 IST