కల్లుతాగే మహిళలే టార్గెట్‌

ABN , First Publish Date - 2021-05-14T09:07:37+05:30 IST

సాయం త్రం స్కూటీపై కల్లు కాంపౌండ్‌కు చేరుకుంటాడు. కల్లు తాగుతూ.. మెడలో/చెవులకు బంగారు నగలు ఉండే మహిళలను టార్గెట్‌గా చేసుకుంటాడు

కల్లుతాగే మహిళలే టార్గెట్‌

మూడేళ్లలో 17 మందిపై రేప్‌.. సీరియల్‌ రేపిస్టుకు బేడీలు.. రూ. 3.95లక్షల సొత్తు స్వాధీనం


హైదరాబాద్‌ సిటీ, మే 13(ఆంధ్రజ్యోతి): సాయం త్రం స్కూటీపై కల్లు కాంపౌండ్‌కు చేరుకుంటాడు. కల్లు తాగుతూ.. మెడలో/చెవులకు బంగారు నగలు ఉండే మహిళలను టార్గెట్‌గా చేసుకుంటాడు. రెండు గంటల్లో పరిచయం పెంచుకుంటాడు. ఆ తర్వాత స్కూటీపై ఎక్కించుకుంటాడు. నగర శివార్లకు తీసుకెళ్లి.. ఒంటిపైనుండే బంగారాన్ని తీయిస్తాడు. వాటిని వారి బ్యాగులోనే పెట్టి, స్కూటీ డిక్కీలో దాచేస్తాడు. ఆ తర్వాత చెట్ల పొదలకు తీసుకెళ్లి, వారిపై అత్యాచారానికి పాల్పడతాడు. వారు తేరుకునేలోపే ఉడాయిస్తాడు. ఇలా 2018 నుంచి 17 మహిళలపై అత్యాచారానికి పాల్పడిన సీరియల్‌ రేపిస్టు ఆటను రాచకొండ పోలీసులు కట్టించారు. గురువారం పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు. ఘట్కేసర్‌ మండలం నారపల్లికి చెందిన హుస్సేన్‌ ఖాన్‌ కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో.. చోరీలు, దోపిడీలు ప్రారంభించాడు. అలా 2005 నేరాల బాట పట్టాడు. 


హైదరాబాద్‌లో పలు ఇళ్లలో చోరీలు చేశాడు. పార్కులు, నిర్మానుష్య ప్రదేశాల్లో కనిపించే ప్రేమజంటలను బెదిరించి, డబ్బులు లాక్కొనేవాడు. 2016లో గోపాలపురం పోలీసులు ఇతనిపై పీడీ చట్టా న్ని ప్రయోగించి, ఏడాది జైలుకు పంపారు. 2017లో జైలు నుంచి విడుదలయ్యాక, ఇతను రూటు మార్చా డు. కల్లు కాంపౌండ్ల వద్ద మహిళలను టార్గెట్‌గా చేసుకోవడం ప్రారంభించాడు. 2017 నుంచి 17 మందిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వారిని శివార్లలోని నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లాక.. నమ్మకంగా మాట్లాడుతాడు. ‘‘పోలీసులు వచ్చినా.. ఎవరైనా దుండగులు వచ్చినా.. నగలను దోచుకుంటారు. అందుకే.. నగలు తీసి ఇస్తే.. డిక్కీలో పెడతాను’’ అని నమ్మించేవాడు. నెలకో మహిళను అనుభవించాలని హుస్సేన్‌ టార్గెట్‌గా పెట్టుకున్నాడని సీపీ వివరించారు. ఇతను నేరానికి పాల్పడే ముందు సెల్‌ఫోన్‌ను ఇంట్లోనే పెట్టి వెళ్తాడనిచెప్పారు. 


ఇలా దొరికాడు..

ఈ నెల-1న జిల్లెలగూడలోని ఓ కల్లుకాంపౌండ్‌ వద్ద ఇదే నేరశైలితో ఓ మహిళను ముగ్గులోకి దిం పాడు. ఆమెను పెద్ద అంబర్‌పేట పరిధిలోని ఓఆర్‌ఆర్‌ సమీపానికి తీసుకొచ్చాడు. ఆమె చెవి కమ్మలు, గొలు సు, ఇతర వస్తువులను డిక్కీలో దాచేశాడు. తన పనికానిచ్చి.. ఉడాయించాడు. పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ,  సాంకేతిక ఆధారాలతో నిందితుడి ఆట కట్టించారు.

Updated Date - 2021-05-14T09:07:37+05:30 IST