కరోనా నిబంధనలు సడలించిన దుబాయి

ABN , First Publish Date - 2021-05-18T04:19:31+05:30 IST

కరోనా కారణంగా ప్రపంచంలో చాలా దేశాలు హోటళ్లు, రెస్టారెంట్లు తదితరాలపై ఆంక్షలు విధించాయి. ఉద్యోగస్తులందరినీ ఆఫీసులకు రానివ్వకుండా కొంతమందితోనే పని జరిపించుకోవాలని సూచనలు చేశాయి

కరోనా నిబంధనలు సడలించిన దుబాయి

దుబాయి: కరోనా కారణంగా ప్రపంచంలో చాలా దేశాలు హోటళ్లు, రెస్టారెంట్లు తదితరాలపై ఆంక్షలు విధించాయి. ఉద్యోగస్తులందరినీ ఆఫీసులకు రానివ్వకుండా కొంతమందితోనే పని జరిపించుకోవాలని సూచనలు చేశాయి. ప్రస్తుతం దుబాయిలో కరోనా పరిస్థితి కొంత కుదుట పడుతోంది. దీంతో కరోనా నిబంధనలను సడలించాలని ఇక్కడి ప్రభుత్వం నిర్ణయించుకుంది. హోటళ్లు పూర్తి సామర్ధ్యంతో పని చేయడానికి అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం.. కాన్సర్ట్‌లు, క్రీడా కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా పచ్చజెండా ఊపింది. అయితే వీటికి వచ్చే వారందరూ వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని మాత్రం షరతు విధించింది.


రెస్టారెంట్లు, హోటళ్లతోపాటు వినోద వేదికల్లో కూడా సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించింది. అయితే ఇన్ని సడలింపులు ఉన్నా సామాజిక దూరం, ఫేస్ మాస్క్ మాత్రం తప్పనిసరి అని దుబాయిలోని సుప్రీమ్ కమిటీ ఆఫ్ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ పేర్కొంది.

Updated Date - 2021-05-18T04:19:31+05:30 IST