పిల్లలతో కలిసి రోడ్డెక్కిన బాతు.. దీంతో..!
ABN , First Publish Date - 2021-06-18T23:31:05+05:30 IST
ఓ బాతు వాహనాలను స్తంభింప చేసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ సిటీ
వాషింగ్టన్: ఓ బాతు వాహనాలను స్తంభింప చేసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ సిటీలో ఓ బాతు సందడి చేసింది. అత్యంత రద్దీగా ఉండే రోడ్డుపైకి.. తన పిల్లలతోపాటు వచ్చేసింది. బాతు రాకను గమనించిన వాహన దారులు.. తమ వాహనాలను అక్కడే నిలిపివేసి, దానికి దారిచ్చారు. దీంతో ఆ బాతు ఎంచక్కా.. తన పిల్లలతో కిలిసి రోడ్డు దాటేసి.. ఓ షాప్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కాగా.. బాతు రోడ్డు దాటుతుండగా అక్కడున్న ప్రజలు తమ ఫోన్‌లను పని చెప్పారు. పిల్లలతో బాతు రోడ్డు దాటుతున్న దృశ్యాలను వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అదికాస్తా వైరల్ అయింది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు.. దాన్ని లైక్ చేస్తూ ఇతరులకు షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గంటల వ్యవధిలోనే ఈ వీడియో.. 1.6లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.