ఏడాదికి 2% కీటకాలు మాయం

ABN , First Publish Date - 2021-01-13T14:31:55+05:30 IST

గత కొన్నేళ్లుగా కీటకాల మనుగడ ప్రమాదంలో పడింది. దీనికి సవాలక్ష కారణాలున్నాయని కీటక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఏడాదికి 2% కీటకాలు మాయం

  • జాబితాలో తేనెటీగలు కూడా..: శాస్త్రవేత్తలు

వాషిగ్టన్‌, జనవరి 12: గత కొన్నేళ్లుగా కీటకాల మనుగడ ప్రమాదంలో పడింది. దీనికి సవాలక్ష కారణాలున్నాయని కీటక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ కనెక్టికట్‌లోని కీటకశాస్త్ర నిపుణుడు డేవిడ్‌ వాగ్నర్‌ నేతృత్వంలో.. ప్రపంచవ్యాప్తంగా 56 మంది శాస్త్రవేత్తల బృందం చేసిన 12 అధ్యయనాల సారాంశాన్ని నేషనల్‌ అకాడమీస్‌ ఆఫ్‌ సైన్సెస్‌ వెల్లడించింది.


వాతావరణ మార్పు, వ్యవసాయంలో వాడే రసాయన మందులు, భూవినియోగం పెరగ డం, కాలుష్యం వంటి రకరకాల కారణాలతో ఏడాదికి 1-2శాతం కీటకాలు నాశ నమవుతున్నాయి. గణనీయంగా క్షీణిస్తున్న కీటకాల జాబితాలో సీతాకోక చిలుకలు, తేనెటీగలు వంటివి ఉండడం శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది.  


Updated Date - 2021-01-13T14:31:55+05:30 IST