మరిన్ని దేశాల్లో విస్తరణ దిశగా ‘ఈజీ ట్రిప్‌ ప్లానర్స్‌’

ABN , First Publish Date - 2021-09-16T23:33:20+05:30 IST

దేశాల్లో తమ సేవలను విస్తరించేందుకు ‘ఈజీ ట్రిప్‌ ప్లానర్స్‌’ సిద్ధమవుతోంది.

మరిన్ని దేశాల్లో విస్తరణ దిశగా ‘ఈజీ ట్రిప్‌ ప్లానర్స్‌’

హైదరాబాద్ : విదేశాల్లో తమ సేవలను విస్తరించేందుకు ‘ఈజీ ట్రిప్‌ ప్లానర్స్‌’ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు అందించింది. ఫిలిప్పిన్స్‌, థాయ్‌లాండ్, యూఎస్‌ దేశాల్లో తమ అనుబంధ సంస్థల ద్వారా సేవలను విస్తరించాలని  భావిస్తున్నట్టు ఈజీ ట్రిప్‌ సీఈఓ, కో ఫౌండ్‌ నిశాంత్‌ పిట్టి వెల్లడించారు. ప్రస్తుతం యూఏఈ, సింగపూర్‌, యూకే దేశాల్లో మాత్రమే ఈ సంస్థ సేవలనందింస్తోంది. రెండోదశలో మరిన్ని దేశాల్లో సంస్థను విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది. కోవిడ్‌ నుంచి ఇప్పుడిప్పుడే అతిథ్యరంగం కోలుకుంటోన్న నేపధ్యంలో... ఇంటర్నేషనల్‌ హాలీడే ప్యాకేజీ బిజినెస్‌కు మళ్ళీ పూర్వవైభవం వస్తుందని ఈజీ ట్రిప్‌ భావిస్తోంది. ఈ క్రమంలో... విస్తరణపై దృష్టిపెట్టామని, విదేశాల్లోనూ తమ కార్యకలాపాలను  భారీగా పెంచుకోగలమని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. 


కంపెనీ తాజా ప్రకటనతో ఈజీ ట్రిప్‌ ప్లానర్స్‌ షేర్‌ ఈ రోజు జోరు పుంజుకుంది. ఇంట్రాడేలో షేర్‌ దాదాపు 17 శాతం లాభపడి డే గరిష్ట స్థాయి రూ. 632.79 కు చేరింది. ప్రస్తుతం పన్నెండు శాతానికి పైగా లాభంతో రూ. 610.60 వద్ద షేర్‌ కదలాడుతోంది. ఇవాళ ఇప్పటివరకు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 50 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. ఇక... కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 6,616 కోట్లకు పెరగడం గమనార్హం. 

Updated Date - 2021-09-16T23:33:20+05:30 IST