మతం పేరిట ఓట్లడుగుతారా?

ABN , First Publish Date - 2021-04-08T07:15:19+05:30 IST

మైనారిటీలంతా గంపగుత్తగా టీఎంసీ అభ్యర్థులకు ఓటేయాలంటూ ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ పిలుపివ్వడంపై ఎలక్షన్‌ కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆమె మతం పేరిట ఓట్లడిగారనీ, ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళిని

మతం పేరిట ఓట్లడుగుతారా?

మమతకు ఈసీ నోటీసు


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7: మైనారిటీలంతా గంపగుత్తగా టీఎంసీ అభ్యర్థులకు ఓటేయాలంటూ ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ పిలుపివ్వడంపై ఎలక్షన్‌ కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆమె మతం పేరిట ఓట్లడిగారనీ, ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమని బీజేపీ ఆరోపించింది. ‘మైనారిటీల  ఓట్లు చీలిపోరాదు. వివిధ పార్టీలకు మీ ఓటు వేసి ఈ అవకాశాన్ని వృథా పర్చకండి’ అని ఏప్రిల్‌ 3న తారకేశ్వర్‌లో జరిగిన సభలో ఆమె పిలుపిచ్చిన వీడియో, ఆడియో క్లిప్‌లను జత చేసింది. దీనిపై మమతకు ఈసీ నోటీసులిచ్చి 48 గంటల్లోగా సమాధానమివ్వాలని కోరింది. బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ వాహనంపై దాడి జరిగింది.

Updated Date - 2021-04-08T07:15:19+05:30 IST