కరోనా పెరుగుతున్నా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది: ఫెడ్

ABN , First Publish Date - 2021-07-30T07:24:52+05:30 IST

అమెరికాలో డెల్టా వేరియంట్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా యూఎస్‌లో నమోదవుతున్న కరోనా

కరోనా పెరుగుతున్నా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది: ఫెడ్

వాషింగ్టన్: అమెరికాలో డెల్టా వేరియంట్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా యూఎస్‌లో నమోదవుతున్న కరోనా కేసుల్లో 60శాతంపైగా పెరుగుదల కనిపించిందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపాయి. అయితే కరోనా మహమ్మారి ఇలా పెరుగుతున్నప్పటికీ.. దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం గాడి తప్పలేదని ఫెడరల్ రిజర్వ్ తెలిపింది. యూఎస్ ఎకానమీ పునరుద్ధరణ సాఫీగానే సాగుతోందని ఈ సంస్థ వెల్లడించింది. గతేడాది కరోనా విజృంభణ సమయంలో యూఎస్ సెంట్రల్ బ్యాంక్ కొంత ఆర్థిక సాయం అందించడానికి ముందుకొచ్చింది. అమెరికా జాబ్ మార్కెట్ మరికొంత పుంజుకోవాలని, ఆ తర్వాత సెంట్రల్ బ్యాంకు తన మద్దతు ఉపసంహరించుకోవచ్చని ఫెడ్ చీఫ్ జెరోమె పావెల్ తెలిపారు.

Updated Date - 2021-07-30T07:24:52+05:30 IST