పేర్లు కాదు ఆలోచన విధానం మారింది: సురేష్

ABN , First Publish Date - 2020-09-16T22:53:34+05:30 IST

రాష్ట్రంలో కులమతాలకతీతంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

పేర్లు కాదు ఆలోచన విధానం మారింది: సురేష్

ప్రకాశం: రాష్ట్రంలో కులమతాలకతీతంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. త్రిపురాంతకంలో వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ‘పథకాలు పేర్లు మారాయని టీడీపీ అంటోంది. పేర్లు కాదు ఆలోచన విధానం మారింది. సీఎం జగన్.. పేదల అవసరాలను గుర్తెరిగి పథకాలు రూపకల్పన చేస్తున్నారు. గతంలో టీడీపీ అన్ని పథకాల్లో అవినీతికి పాల్పడింది. గత ప్రభుత్వం 500 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం గర్భవతులు, బాలింతల కోసం నాలుగు రెట్లు ఖర్చు చేస్తోంది. సంక్షేమ కార్యక్రమాలు పకడ్భందిగా అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని చెప్పారు. గత ప్రభుత్వాలు కార్పొరేట్ కళాశాలకు కొమ్ముకాస్తే వాటి విధానాలపై నియంత్రణ చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాలని సీఎం పట్టుబట్టారన్నారు. దీనిని టీడీపీ అడ్డుకొంటూ కోర్టులకు వెళ్లి సంబరపడుతోంది’ అని మంత్రి విమర్శించారు.

Updated Date - 2020-09-16T22:53:34+05:30 IST