విద్య కోసం రుణాలు... వడ్డీ తక్కువే...

ABN , First Publish Date - 2021-04-06T21:50:17+05:30 IST

ఆదాయంతో పాటు ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్బణం, ఇతర కారణాల నేపధ్యంలో... వార్షికాదాయంలో 13 శాతం వరకు ఉన్నత విద్యకు కేటాయించాల్సిన పరిస్థితి ఉన్నట్లు ఓ సర్వే వెల్లడించింది. కాగా విద్యారుణాలపై వివిధ బ్యాంకులు వివిధ రకాలుగా వడ్డీని వసూలు చేస్తున్నాయి. వివరాలిలా ఉన్నాయి.

విద్య కోసం రుణాలు... వడ్డీ తక్కువే...

హైదరాబాద్ : ఆదాయంతో పాటు ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్బణం, ఇతర కారణాల నేపధ్యంలో... వార్షికాదాయంలో 13 శాతం వరకు ఉన్నత విద్యకు కేటాయించాల్సిన పరిస్థితి ఉన్నట్లు ఓ సర్వే వెల్లడించింది. కాగా విద్యారుణాలపై వివిధ బ్యాంకులు వివిధ రకాలుగా వడ్డీని వసూలు చేస్తున్నాయి. వివరాలిలా ఉన్నాయి. 


ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకులు 7 శాతం కంటే తక్కువ వడ్డీతో విద్యారుణాలనిస్తున్నాయి. ఇక... యూనియన్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వంటి బ్యాంకులు వరుసగా 6.8 శాతం, 6.85 శాతం వడ్డీతో విద్యారుణాలు మంజూరు చేస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో ఇది పది శాతం వరకు ఉంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకులు 9.55 శాతం, 9.70శాతం, 10.50 శాతం వడ్డీ చొప్పున రుణాలనిస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో యూనియన్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా అతి తక్కువగా 6.8 శాతంతో రుణాలనిస్తుండగా, ఇండియన్‌ బ్యాంక్ అత్యధికంగా 7.15 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. 


కాగా, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో వడ్డీ రేట్లలో రెండు శాతం వరకు తేడాలున్నాయి. వ్యక్తిగత రుణాలు, విద్యారుణాల కాలపరిమితిలో తేడాలుంటాయన్న విషయం తెలిసిందే. సాధారణంగా బ్యాంకుల్లో పర్సనల్‌ లోన్లు తీసుకునేవారికి 5-7  సంవత్సరాల వరకు కాలపరిమితి ఉంటుంది.


అయితే విద్యారుణాలకు అత్యధికంగా 15 సంవత్సరాల వరకు కాలపరిమితి ఉంటుంది. ఈ సౌలభ్యం కారణంగా ఎక్కువ మంది తల్లిదండ్రులు, విద్యార్థులు... విదేశాల్లో ఉన్నత విద్య కోసం ద్యారుణాలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. 


కాగా, విద్యారుణాలపై చెల్లించే వడ్డీకి పన్ను మినహాయింపు ఉంటుందన్న విషయం తెలిసిందే. లోన్‌ తిరిగి చెల్లించడం ప్రారంభించిన ఏడాది నుంచి 8 ఏళ్ల వరకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. అందుకే రుణాలు తీసుకున్న వారు... ఆ రుణాన్ని తీర్చివేసేందుకుగాను  ఎనిమిదేళ్ల గడువును పెట్టుకుంటే పన్ను మినహాయింపుల ద్వారా అధిక ప్రయోజనాన్ని పొందవచ్చు. 

Updated Date - 2021-04-06T21:50:17+05:30 IST