పోలింగ్‌రోజున ఉద్యోగులు ఓటువేసేలా ప్రోత్సహించండి

ABN , First Publish Date - 2020-11-26T20:46:10+05:30 IST

జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో భాగంగా డిసెంబర్‌ 1వ తేదీన జరిగే పోలింగ్‌ సందర్భంగా తమ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేలా వారిని ప్రోత్సహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కేంద్ర ప్రభుత్వ, పబ్లిక్‌రంగ సంస్ధలకు విజ్ఞప్తిచేసింది.

పోలింగ్‌రోజున ఉద్యోగులు ఓటువేసేలా ప్రోత్సహించండి

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో భాగంగా డిసెంబర్‌ 1వ తేదీన జరిగే పోలింగ్‌ సందర్భంగా తమ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేలా వారిని ప్రోత్సహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కేంద్ర ప్రభుత్వ, పబ్లిక్‌రంగ సంస్ధలకు విజ్ఞప్తిచేసింది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ జరిగే పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగులు కార్యాలయానికి ఆలస్యంగా వచ్చినా, లీవ్‌ పెట్టినా అనుమతించాలని విజ్ఞప్తిచేసింది.


ఓటు హక్కు వినియోగించుకోవడం ఎంతో విలువైన విషయమన్న విషయం తెలిసిందే. కాబట్టి ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేలా వారికి సహకరించాలని అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధానాధికారులకు ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి ఎం. అశోక్‌కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-11-26T20:46:10+05:30 IST