Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎన్నికల అధికారి తీరు అర్థం కావడం లేదు: కేశినేని

విజయవాడ: కొండపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి టీడీపీ వార్డు సభ్యులతో ఎంపీ కేశినేని నాని బయటకు వచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల అధికారి తీరు అర్థం కావడం లేదని విమర్శించారు. ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలీదని, బయటకి లోపలికి తిరుగుతున్నారని తెలిపారు. కోర్టు ఆదేశాలున్నా ఎన్నిక ఎందుకు వాయిదా వేశారో తెలీదన్నారు. ఎప్పటికి వాయిదా పడింది అనేది కూడా తెలుపలేదని, రేపటికి వాయిదా వేస్తారా? నిరవధికంగా వాయిదా వేస్తారా అనేది చూడాలని నాని పేర్కొన్నారు. వైసీపీ వర్గీయులు గొడవలు, భయాందోళనలు సృష్టించారని దుయ్యబట్టారు. పోలీసులపైకి కూడా దాడులకు తెగబడ్డారని తెలిపారు. మీడియా ఫుటేజ్‌తో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కేశినేని నాని ప్రకటించారు.


Advertisement
Advertisement