కరోనా నేపథ్యంలోనూ ఉద్యోగానికి వెళ్తున్నారా.. అయితే ఇలా చేయండి..!

ABN , First Publish Date - 2020-04-10T12:55:22+05:30 IST

లాక్‌ డౌన్‌ వేళ చాలామంది ఇంట్లో ఉంటున్నారు. అత్యవసర సేవల విభాగాలు, సంస్థల ఉద్యోగులు మాత్రం బయటకు వెళ్లక తప్పడం లేదు.

కరోనా నేపథ్యంలోనూ ఉద్యోగానికి వెళ్తున్నారా.. అయితే ఇలా చేయండి..!

  • విధి నిర్వహణలో ఉన్నా.. ఇంటికి వస్తున్నా..
  • జాగ్రత్తలు పాటించాల్సిందే
  • తమ కార్యాలయ ఉద్యోగులకు కేంద్ర వైద్య శాఖ సూచనలు 
  • అందరూ పాటిస్తే బెటర్‌

హైదరాబాద్‌ : లాక్‌ డౌన్‌ వేళ చాలామంది ఇంట్లో ఉంటున్నారు. అత్యవసర సేవల విభాగాలు, సంస్థల ఉద్యోగులు మాత్రం బయటకు వెళ్లక తప్పడం లేదు. జీహెచ్‌ఎంసీ, పోలీస్‌, వాటర్‌ బోర్డు, విద్యుత్‌ తదితర విభాగాలతోపాటు పలు ప్రైవేట్‌ సంస్థల ఉద్యోగులు విధి నిర్వహణకు వెళ్తున్నారు. ప్రాణాలకు తెగించి పని చేసే వారి వల్ల కుటుంబ సభ్యులకు ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని కొంత మేర అరికట్టవచ్చు. తమ కార్యాలయంలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేం ద్ర వైద్య శాఖ పలు సూచనలు చేస్తూ సర్క్యులర్‌ జారీ చేసిం ది. ఈ సలహాలను లాక్‌ డౌన్‌ సమయంలో బయటకి వెళ్లే వారందరూ పాటిస్తే బాగుంటుందని వైద్యులు చెబుతున్నారు. 


ఆఫీ‌స్‌లో...

  • కార్యాలయంలో పనిచేసే ప్రతి వ్యక్తి సబ్బు, శానిటైజర్‌ వాడాలి.
  • ఒకరితో మరొకరు చేతులు కలుపవద్దు.
  • కళ్లు, ముక్కు, నోరు తాకకుండా ఉండాలి.
  • దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు టిష్యూ లేదా మోచేతిని అడ్డు పెట్టుకోవాలి. 
  • రద్దీ ప్రాంతాలు, ప్రజలు ఎక్కువగా గుమిగూడే చోటికి వెళ్లొద్దు.
  • క్యాంటీన్లో గుంపులుగా చేరి కబుర్లాడవద్దు. 
  • కార్యాలయం నుంచి బయలుదేరే సమయంలో ఇంటికి వస్తున్న విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాలి.
  • ఇంటి గుమ్మం ముందు సర్ఫ్‌ లేదా బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపిన నీళ్ల బకెట్‌ ఉంచమనాలి. 
  • తలుపు తెరిచి ఉండడం వల్ల మీరు కాలింగ్‌ బెల్‌ కొట్టాల్సిన అవసరం ఉండదు. డోర్‌ హ్యాండ్‌ కూడా ముట్టుకోకుండా ఉండొచ్చు. 
  • కారు లేదా బైక్‌ తాళాలు, పెన్‌,  ఫోన్‌, వాలెట్‌, శానిటైజర్‌ సీసా, ఇంటి బయట ఉన్న డబ్బాలో ఉంచాలి.
  • బకెట్‌లోని సర్ఫ్‌నీళ్లలో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం వాటర్‌లో కొద్ది సేపు నిలబడాలి. అదే సమయంలో డబ్బాలో పెట్టిన వస్తువులకు టిష్యూతో శానిటైజర్‌ రుద్దాలి. 
  • చేతులు మరోసారి కడుక్కోవాలి.
  • తర్వాత ఏ వస్తువులు తాకకుండా ఇంట్లోకి వెళ్ళాలి. తలుపు తెరిచి ఉంచమని చెప్పి నేరుగా బాత్‌ రూమ్‌లోకి వెళ్లాలి. 
  • అంతకుముందే డిటర్జెంట్‌ కలిపిన నీళ్లను బకెట్‌ లో ఉంచమని చెప్పాలి. 
  • ఇన్నర్‌లతో సహా దుస్తులు బకెట్‌లో పెట్టాలి. 
  • షాంపు, సబ్బుతో తలస్నానం చేయాలి. 
  • అనంతరం బకెట్‌లోని దుస్తులను వాషింగ్‌ మిషన్‌లో ఉంచి అత్యధిక ఉష్ణోగ్రత ఉండేలా ఆన్‌ చేయాలి. 
  • వాషింగ్‌ మిషన్‌ లేకుంటే దుస్తులు ఉతికిన అనంతరం స్నానం చేయాలి. 
  • ఉతికిన దుస్తులను ఎండలో ఆరేయాలి.

Updated Date - 2020-04-10T12:55:22+05:30 IST