ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి

ABN , First Publish Date - 2020-05-19T10:42:41+05:30 IST

వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకానికి అనుసంధానం

ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య


వేంసూరు, మే 18: వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆయన వేంసూరు మండలం లింగపాలెం, లచ్చన్నగూడెం, వెంకటాపురం గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు బత్తాయి పండ్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మాస్కలతో కూడిన కిట్లును పంపిణీ చేశారు.


ఈజీఎ్‌సను వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకు కూడా ఉపయోగం ఉంటుందని అన్నారు. లాక్‌డౌన్‌ కష్టకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదల ఖాతాల్లో రూ.1500 చొప్పున జమ చేశారని అన్నారు. అనంతరం వెంకటాపురంలో పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌, తహసీల్దార్‌ శకుంతల, ఎంపీడీవో వీరేశం, ఆత్మ చైర్మన్‌ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2020-05-19T10:42:41+05:30 IST