ఎలక్ర్టానిక్స్‌కు ప్రోత్సాహం

ABN , First Publish Date - 2021-05-05T08:30:07+05:30 IST

రాష్ట్ర నూతన ఎలకా్ట్రనిక్స్‌ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. స్థిర పెట్టుబడిలో 20 శాతం.. గరిష్ఠంగా రూ.20 కోట్ల వరకు రాయితీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు 25 శాతం గరిష్ఠంగా 25 శాతం రాయితీ ఇచ్చే

ఎలక్ర్టానిక్స్‌కు ప్రోత్సాహం

పెట్టుబడులే లక్ష్యంగా నూతన విధానానికి కేబినెట్‌ ఆమోదం

స్థిర పెట్టుబడిలో 20% రాయితీ!

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 25 శాతం

అత్యధికంగా 25 కోట్ల వరకు 

ఉత్పత్తి నాటి నుంచి ఐదేళ్లపాటు విద్యుత్‌ చార్జీల రీయింబర్స్‌

మహిళల రాత్రి షిఫ్టుకు ఓకే

మొత్తంగా మూడు షిఫ్టులు

పీపీపీ పద్ధతిలో ఎలక్ర్టానిక్స్‌ తయారీ క్లస్టర్లు

సెమీకండక్టర్‌ పరిశ్రమల పరిశీలనకు కమిటీ

500 కోట్లు పెట్టుబడి దాటితే ప్రత్యేక రాయితీలు

2024 వరకు అమల్లో నూతన విధానం


అమరావతి, మే 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర నూతన ఎలకా్ట్రనిక్స్‌ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. స్థిర పెట్టుబడిలో 20 శాతం.. గరిష్ఠంగా రూ.20 కోట్ల వరకు రాయితీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు 25 శాతం గరిష్ఠంగా 25 శాతం రాయితీ ఇచ్చే విధంగా ఈ విధానం (2021-2024) రూపొందించారు. అదేవిధంగా వాణిజ్య ఉత్పత్తి ప్రారంభ మైన తేదీ నుంచి ఐదేళ్లపాటు విద్యుత్‌ చార్జీల్లో యూనిట్‌కు ఒక రూపాయి చొప్పున రీయింబర్స్‌ ఇస్తారు. కేటాయించిన స్థలంపై స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు ఇస్తారు. మరోవైపు దేశీయ రవాణాకు సదరు పరిశ్రమ ఖర్చుచేసిన మొత్తంలో 25శాతం.. గరిష్ఠంగా రూ.50 లక్షలను తిరిగి చెల్లిస్తారు. విదేశాల్లో ఉన్న ఎలక్ర్టానిక్స్‌ ప్లాంట్లను రాష్ట్రానికి తరలిస్తామంటే.. రవాణా సబ్సిడీ కింద రూ.2 కోట్ల వరకు రీయింబర్స్‌ చేస్తారు. నూతన ఎలక్ర్టానిక్స్‌ విధానానికి రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం.. పెట్టుబడి పెట్టే కంపెనీలకు ఐదు శాతం వరకు వడ్డీ రాయితీ (గరిష్ఠంగా రూ.1.5 కోట్ల వరకు) ఐదేళ్లపాటు అందిస్తారు. అన్ని ఎలక్ర్టానిక్స్‌ పరిశ్రమల్లోను మూడు షిఫ్టుల పనికి, మహిళలు రాత్రి షిఫ్టులో పనిచేసేందుకు అనుమతిస్తారు. అయితే వారికి తగిన రక్షణ ఏర్పాట్లను కంపెనీ చేయాలి. ఎస్‌జీఎ్‌సటీలో రాయితీలిస్తారు. మొబైల్‌ ఫోన్లు, ఎలక్ర్టానిక్స్‌ విడిభాగాలు, ఇండస్ర్టియల్‌ ఎలక్ర్టానిక్స్‌, కన్జ్యూమర్‌ ఎలక్ర్టానిక్స్‌ తదితర రంగాల్లో భారీ ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించడం నూతన విధానం లక్ష్యంగా పేర్కొన్నారు. ఎలక్ర్టానిక్స్‌ విడి భాగాలను అసెంబ్లింగ్‌ చేసే స్థాయి నుంచి రాష్ట్రాన్ని ఎలక్ర్టానిక్స్‌ పరికరాల తయారీ రంగ హబ్‌గా తయారుచేయాలన్నది ఈ విధానం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది. 


క్లస్టర్లు, ఎంఎ్‌సఎంఈ పార్కులు.. 

ప్రభుత్వం ఐటీ విభాగం నోడల్‌ ఏజెన్సీగా రాష్ట్రంలో ఎలక్ర్టానిక్‌ మాన్యుఫ్యాక్యరింగ్‌ క్లస్టర్లను ఏర్పాటు చేస్తుంది. ఎలక్ర్టానిక్స్‌ వస్తువులు, ఉప వస్తువుల తయారీ కోసం క్లస్టర్లు, ఎంఎ్‌సఎంఈ పార్కులు కూడా ఏర్పాటుచేస్తుంది. వీటిలో పరిశ్రమలు, కంపెనీలు పెట్టేందుకు అవసరమైన స్థలాన్ని, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం-పరిశ్రమ ప్రతినిధులతో కలిపి నియమించిన సంప్రదింపుల కమిటీ (సీసీఐటీఈఐ) సిఫారసుల మేరకు స్థలం కేటాయిస్తారు. రెడీ టు ఆక్యుపై స్పేస్‌ కూడా ప్రభుత్వం అందిస్తుంది. ఈ క్లస్టర్లలో కాలుష్యశుద్ధి నియంత్రణ ప్లాంట్లను ఏపీ పర్యావరణ నిర్వహణ కమిషన్‌తో కలిసి ఏర్పాటుచేస్తారు. మరోవైపు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఎలక్ర్టానిక్స్‌ తయారీ క్లస్టర్ల ఏర్పాటుకు ఈ విధానంలో అవకాశం కల్పించారు. మార్కెట్లో లీడింగ్‌లో ఉన్న కంపెనీలకు ఇలాంటి క్లస్టర్ల ఏర్పాటులో అవకాశం కల్పిస్తారు. అలా ఎంపికచేసిన కంపెనీ, కన్సార్షియమే సదరు క్లస్టర్‌లో పెట్టుబడులు, పరిశ్రమలను తెచ్చే బాధ్యత తీసుకోవాలి. భూమి, ఇతర మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది.


ఆ క్లస్టర్‌లో నిర్మించే భవనాలకు ఏపీ భవన నిర్మాణ నిబంధనలనుంచి మినహాయింపు ఇస్తారు. ఫైర్‌ అనుమతులు, ఇతర అనుమతులు మాత్రం తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే జోన్‌ ఎ, జోన్‌ బి అని పరిశ్రమలు పెట్టే ప్రాంతాన్ని బట్టి ప్రభుత్వం విభజన చేసింది. విద్యుత్‌ యూనిట్‌కు రూపాయి రీయింబర్స్‌మెంట్‌ జోన్‌ ఎ పరిశ్రమలకు మాత్రమే వర్తిస్తుంది. జోన్‌ బి పరిశ్రమలకు యూనిట్‌ రూ.4.50 చొప్పున విద్యుత్‌ సరఫరా చేస్తారు. మరోవైపు రూ.500 కోట్ల పెట్టుబడి, నాలుగువేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీలు ఉంటాయి. మెగా పెట్టుబడులుగా పేర్కొనే వీటికి ప్రత్యేకంగా మరిన్ని రాయితీలను అప్పటికప్పుడు ప్రభుత్వ నిర్ణయం మేరకు కల్పిస్తారు. 


విశాఖకు ఎప్పుడైనా వెళ్లొచ్చు: పేర్ని నాని

ప్రభుత్వానికి కరోనా కట్టడి చేయడమే ముఖ్యమని, పాలనా రాజధానిగా విశాఖకు ఎప్పుడైనా తరలి వెళ్లొచ్చని సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఈ నెలలో మంచి ముహూర్తాలు ఉన్నందున విశాఖకు రాజధానిని తరలించే ఆలోచన ఉందా అని ప్రశ్నించగా, ‘విశాఖకు ఎప్పుడైనా వెళ్లొచ్చు. కరోనాను కట్టడి చేయడమే మా ముందున్న లక్ష్యం’ అన్నారు. 


పరిశోధన, అభివృద్ధి హబ్‌ ఏర్పాటు

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితిని అధ్యయనం చేసి రాష్ట్రానికి అనువుగా మార్చుకోవడానికి వీలుగా ఒక పరిశోధన, అభివృద్ధి హబ్‌ను రాష్ట్రస్థాయిలో ఏర్పాటుచేస్తారు. దీనికి అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయిస్తుంది. ఎలక్ర్టానిక్స్‌, సెమీకండక్టర్‌ తయారీ రంగ పరిశ్రమలకు సత్వరం అనుమతులిచ్చేందుకు ఇన్వె్‌స్టమెంట్‌ పోర్టల్‌ను ఏర్పాటుచేస్తారు. వైట్‌, గ్రీన్‌ కేటగిరీల్లో ఉన్న పరిశ్రమలకు డీమ్డ్‌ అనుమతులు ఇచ్చేస్తారు. భూమి తీసుకున్న 60 రోజుల్లో ప్రత్యేక బృందాలు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తాయి. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించేందుకు 30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రారంభిస్తారు. నూతన ఎలక్ర్టానిక్స్‌ క్లస్టర్లకు ‘ఐలా’ పాలక వర్గాలను ఏర్పాటుచేస్తారు.

Updated Date - 2021-05-05T08:30:07+05:30 IST