Abn logo
Mar 12 2021 @ 18:15PM

ప్రపంచకప్ ముందు భారత్‌లో ఐపీఎల్ కలిసొస్తుంది: మోర్గాన్

ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది ఐపీఎల్ తమకెంతో ఉపయోగపడుతుందని ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అన్నాడు. టీ20 ప్రపంచకప్ ముందు భారత్‌లో జరగబోయే ఈ మెగా టోర్నీ తమ ఆటగాళ్లకు కలిసొస్తుందని చెప్పాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మోర్గాన్ ఐపీఎల్2021 గురించి మాట్లాడాడు. ఈ ఏడాది ఐపీఎల్ తమకెంతో ప్రత్యేకమని, ప్రపంచకప్ ముందు ఈ టోర్నీ జరగడం తమ ఆటగాళ్లకు మేలు చేస్తుందని అన్నాడు. భారత్‌లోని పరిస్థితులకు ఆటగాళ్లంతా అలవాటు పడేందుకు ఐపీఎల్-2021 గొప్ప అవకాశమని అభిప్రాయపడ్డాడు. ‘ఐపీఎల్‌లో ఎంతోమంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్నారు. వారితో కలిసి ఆడడంతోనే ఎంతో నేర్చుకోవచ్చు. అది నిజంగా ప్రతి ఆటగాడికీ ఓ వరమనే చెప్పాలి’ అంటూ మోర్గాన్ పేర్కొన్నాడు. అంతేకాకుండా.. 2019 ప్రపచంకప్‌ను తమ జట్టు గెలవడంలోనూ ఐపీఎల్ పాత్ర కీలకమని మోర్గాన్ తెలిపాడు.

క్రైమ్ మరిన్ని...