Advertisement
Advertisement
Abn logo
Advertisement

శిల్పాచౌదరి వ్యవహారంపై కొనసాగుతున్న విచారణ

హైదరాబాద్: శిల్పా చౌదరి వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో పోలీసులు రాధికా రెడ్డిని విచారించనున్నారు. శిల్పా చౌదరి తనను మోసం చేసిందని రాధిక పోలీసులకు చెప్పారు. ఆధారాలతో పోలీసుల ముందుకు వస్తానని వెల్లడించారు. బడా మహిళలతో జరిగిన కిట్టి పార్టీలఫై పోలీసులు ఆరా తీస్తున్నారు. శిల్పాచౌదరి కేసులో నార్సింగి పోలీసులు మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే రెండు రోజుల కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. కస్టడీ ముగియడంతో పోలీసులు తిరిగి జైలుకు పంపించారు. మిగతా కేసులో పోలీసులు కస్టడీ కోరనున్నారు. ఇవాళ ఉప్పర్ పల్లి కోర్టులో నార్సింగి పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు.

Advertisement
Advertisement