డీడీ కాలనీలో ముగిసిన ఈడీ సోదాలు

ABN , First Publish Date - 2021-04-10T23:56:04+05:30 IST

డీడీ కాలనీ ఈడీ సోదాలు ముగిశాయి. దివంగత మంత్రి నాయిని నరసింహారెడ్డి దగ్గర గతంలో పీఏగా పని చేసిన ముకుందరెడ్డిని ఈడీ అధికారులు

డీడీ కాలనీలో ముగిసిన ఈడీ సోదాలు

హైదరాబాద్‌: డీడీ కాలనీ ఈడీ సోదాలు ముగిశాయి. దివంగత మంత్రి నాయిని నరసింహారెడ్డి దగ్గర గతంలో పీఏగా పని చేసిన ముకుందరెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పలు కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ రైడ్స్‌ను మొత్తం అధికారులు వీడియోగ్రఫీ చేశారు. ఈ స్కామ్‌లో మరికొంత మందిని ఈడీ విచారణ చేయనుంది. ఈఎస్ఐ కుంభకోణంలో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఏకకాలంలో 10 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించి.. ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. నాయిని కుమారుడు దేవేందర్‌రెడ్డి, అల్లుడు శ్రీనివాస్‌రెడ్డిని ఈడీ విచారించింది. నాయిని నర్సింహారెడ్డి మాజీ పీఎస్ ముకుంద రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ప్రస్తుతం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి దగ్గర పీఏగా ముకుందరెడ్డి పని చేస్తున్నారు. అలాగే మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఇతర నిందితుల ఇళ్ళల్లోనూ ఈడీ సోదాలు చేపట్టింది. ఈఎస్‌ఐ స్కామ్‌లో మనీ లాండరింగ్ పాల్పడినట్లు ఈడీ కేసు నమోదు చేసింది. దేవికారాణి మనీ ల్యాండరింగ్ పాల్పడినట్లు ఆధారాలు ఉండగా, ఇప్పటికే 25 మంది అరెస్ట్ చేసింది. 

Updated Date - 2021-04-10T23:56:04+05:30 IST