Etela: బీజేపీ స్టిక్కర్ ఉంటే ఫొటో తీస్తున్నారు!

ABN , First Publish Date - 2021-07-10T20:52:26+05:30 IST

పోలీసులపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. బీజేపీ స్టిక్కర్ ఉంటే ఫోటో తీస్తున్నారని, ఇదేమైనా నక్సలైట్ పార్టీనా..

Etela: బీజేపీ స్టిక్కర్ ఉంటే ఫొటో తీస్తున్నారు!

హుజూరాబాద్: పోలీసులపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. బీజేపీ స్టిక్కర్ ఉంటే ఫోటో తీస్తున్నారని, ఇదేమైనా నక్సలైట్ పార్టీనా.. లేదా నిషేధిత పార్టీనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోటోలు ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించారు. పోలీసుల వేధింపులు ఎక్కువ అవుతున్నాయన్నారు. హుజురాబాద్‌లో తనకు ఓటేస్తే.. పథకాలు ఎందుకు ఇవ్వరన్నారు. ఇదేమైన వాళ్ళ తాత జాగీరా.. వాళ్ల ఇంట్లో నుంచి ఇస్తున్నారా డబ్బులు అంటూ నిలదీశారు. దుబ్బాక, కరీంనగర్, మల్కాజిగిరిలో ప్రభుత్వ పథకాలు ఇవ్వడం లేదా అని వ్యాఖ్యానించారు.


మహిళా ఎంపీడీవోను ఉద్దేశించి మంత్రి ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలను ఈటల తప్పుబట్టారు. ‘‘మంత్రి అలా అనొచ్చా. ముఖ్యమంత్రి దీనిపై స్పందించాలి.  మంత్రులు కల్లు తగిన కోతుల్లాగా ప్రవర్తిస్తున్నారు. మంత్రులకు మతి భ్రమించింది.. సీఎం ఆదేశాలతో ఏమైనా అంటున్నారా’’ అని ఈటల అన్నారు. 


ఇదిలా ఉంటే, హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్రకు ఈటల రాజేందర్ సిద్ధమయ్యారని సమచారం. రెండు, మూడు రోజుల్లో మొదలుపెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కమలాపూర్ మండలం బత్తినివానిపల్లె నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.



Updated Date - 2021-07-10T20:52:26+05:30 IST