మరో అద్భుతం సృష్టించిన టెస్లా అధినేత! కేవలం ఒక్క ట్వీట్‌తో...

ABN , First Publish Date - 2021-01-27T18:26:31+05:30 IST

టెస్లా సంస్థ అధినేత ఈలాన్ మస్క్‌కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు...! అంతరిక్ష ప్రయోగ సంస్థ స్పెఎక్స్, విద్యుత్ వాహనాల సంస్థ టెస్లా ద్వారా ఆయన టెక్ రంగంలో ఇతరులెవ్వరికీ సాధ్యం కానీ క్రేజ్ సంపాదించుకున్నారు.

మరో అద్భుతం సృష్టించిన టెస్లా అధినేత! కేవలం ఒక్క ట్వీట్‌తో...

వాషింగ్టన్: టెస్లా సంస్థ అధినేత ఈలాన్ మస్క్‌కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు...! అంతరిక్ష ప్రయోగ సంస్థ స్పెఎక్స్, విద్యుత్ వాహనాల సంస్థ టెస్లా ద్వారా ఆయన టెక్ రంగంలో ఇతరులెవ్వరికీ సాధ్యం కానీ క్రేజ్ సంపాదించుకున్నారు. ఈలాన్ సారథ్యంలోని టెస్లా కంపెనీల షేర్లే కాకుండా ఆయన చేసే ట్వీట్లు కూడా ఇటీవల కాలంలో కనకవర్షం కురిపిస్తున్నాయి. తాజాగా ఓ కంపెనీని పొగుడుతూ ఆయన చేసిన ట్వీట్ ఆ కంపెనీకి ఆయాచిత వరంగా మారింది. ఈలాన్ ట్వీట్ అనంతరం కంపెనీ షేర్ల విలువ ఒక్కసారిగా దూసుకుపోయింది. మదుపర్ల దృష్టి పడటంతో కంపెనీపై కనక వర్షం కురిసింది. 


పూర్తి వివరాల్లోకి ఇలాన్ మస్క్ తన పెంపుడు కుక్క కోసమని ఇట్సీ అనే ఈ-కామర్స్ సంస్థ ద్వారా ఉన్నితో తయారు చేసిన ‘మార్షియన్ హెల్మెట్’ను ఆర్డరిచ్చారు. ఆ తరువాత.. మార్షియన్ హెల్మెట్ ఫొటోలు ట్వీట్ చేస్తూ..ఇట్సీ అంటే నాకు ఒకింత ఇష్టం అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో ఇట్సీ షేర్ల ధర ఒక్కసారిగా దూసుకుపోయింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో రికార్డ స్థాయిలో షేరు ధర 8 శాతానికి ఎగబాకింది. మదపర్లు తమ కంపెనీపై ఇంతటి ఆసక్తి ప్రదర్శిస్తుండటంతో ఇట్సీ కూడా ఉబ్బితబ్బిబైపోయింది. మీరంటే ఎంతో ఇష్టం అంటూ వెంటనే రిప్లై ఇచ్చింది. అయితే..ఇట్సీ సంస్థకు అంతకుమునుపే మార్కెట్‌లో తనదైన గుర్తింపు వుంది. ఎందరో చేనేత కళాకారులు తమ వస్తువులను ఇట్సీ ద్వారా అమ్ముతుంటారు. వీరిలో అధికశాతం మహిళలే కావడం మరోవిశేషం. అయితే.. ఈలాన్ పొగడ్తల కారణంగా ఇట్సీకి మునుపెన్నడూ చూడని పాపులారిటీ వచ్చిపడింది. 



Updated Date - 2021-01-27T18:26:31+05:30 IST