విశాఖలో ఈవ్ టీజర్ అరెస్ట్

ABN , First Publish Date - 2020-08-04T21:24:05+05:30 IST

నగరంలో యుతులను వేధిస్తున్న ఈవ్ టీజర్‌ను మహారాణిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విశాఖలో ఈవ్ టీజర్ అరెస్ట్

విశాఖ: నగరంలో యువతులను వేధిస్తున్న ఈవ్ టీజర్‌ను మహారాణిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాగర్ తీరంలోని స్టార్ హోటల్‌లో పనిచేసే మహిళా ఉద్యోగులపట్ల అసభ్యంగా ప్రవర్తించిన రాంబాబుపై మహాళా ఉద్యోగులు ట్విట్టర్ ద్వారా కమిషనర్ ఆర్‌కే మీనాకు ఫిర్యాదు చేశారు. దీంతో రెక్కీ నిర్వహించిన పోలీసులు సీసీ కెమెరా ద్వారా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు రాంబాబుపై దిశా చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. యువతులపట్ల ఎవరు అసభ్యంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Updated Date - 2020-08-04T21:24:05+05:30 IST