ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి

ABN , First Publish Date - 2021-06-12T04:46:41+05:30 IST

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి
ఆమనగల్లు : కూరగాయలు పంపిణీ చేస్తున్న నాయకులు

  • ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వంగ సంజీవరెడ్డి  
  • మెగా డ్రైవ్‌లో భాగంగా సేవా కార్యక్రమాలు


ఇబ్రహీంపట్నం: ఏబీవీపీ ఫర్‌ సొసైటీ మెగా డ్రైవ్‌లో భాగంగా శుక్రవారం ఇబ్రహీంపట్నం ఏబీవీపీ శాఖ ఆంద్వర్యంలో చెర్లపటేల్‌గూడ, ఎలిమినేడు గ్రామాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వంగ సంజీవరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ప్రాణవాయువునందించే చెట్లను ఎక్కడిక్కడ నరికివేస్తున్నారని, దీంతో సమస్య తలెత్తుతుందన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటి సంరంక్షించే బాధ్యతను తీసుకున్నప్పుడే పర్యావరణాన్ని పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ టెక్నికల్‌ కన్వీనర్‌ శశిధర్‌రెడ్డి, పవన్‌, సాయితేజ, ఉదమ్‌, శివ తదితరులున్నారు.

ప్రతి  ఒక్కరూ మొక్కలు నాటాలి

యాచారం : ప్రతి ఒక్కరూ మొక్కలునాటి సంరక్షించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వంగ సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం యాచారం మండల పరిధి కొత్తపల్లి గ్రామంలో మొక్కలునాటారు. 

మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ

కడ్తాల్‌: విద్యారంగ సమస్యలతో పాటు సామాజిక సేవ, ప్రజా చైతన్య కార్యక్రమాల్లో ఏబీవీపీ ఎప్పుడూ ముందుంటుందని కడ్తాల ఏబీవీపీ నగర కార్యదర్శి క్యామ శ్రీకాంత్‌ అన్నారు. మానవాళి మనుగడను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. కడ్తాల మండలం పెద్దిరెడ్డి చెరువు తండాలో శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. 

నిరుపేద కుటుంబాలకు కూరగాయల పంపిణీ 

ఆమనగల్లు/తలకొండపల్లి: ఆమనగల్లు పట్టణంలో శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు జల్లెల్ల శివ, శ్రీను, పాతకో ట శ్రీశైలం, శివ, తదితరులు పాల్గొన్నారు. తలకొండపల్లి మం డల కేంద్రంలో కార్మికులు, ఉపాధి హామీ కూలీలకు మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. 

కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

షాబాద్‌ : ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కళ్లెం సూర్యప్రకాష్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని కొమరబండ, నాందార్‌ఖాన్‌పేట్‌, మాచన్‌పల్లి గ్రామాల్లో కరోనా బాధితులకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఉపాధిహామీ కూలీలకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వంద మొక్కలను నాటారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి బర్ల శ్రీకాంత్‌, అభినవ్‌, భవదీష్‌, వేణు, తదితరులన్నారు. 

రద్దీ ప్రదేశాల్లో శానిటైజేషన్‌

మొయినాబాద్‌: మండలంలోని రద్దీగా ప్రదేశాల్లో శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో శానిటైజేషన్‌ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బస్టాండ్‌, పోలీ్‌సస్టేషన్‌, తదితర ప్రాంతాల్లో శానిటైజేషన్‌ చేపట్టారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు షాపురం శ్రీకాంత్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-12T04:46:41+05:30 IST