నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమం!

ABN , First Publish Date - 2020-10-22T03:57:35+05:30 IST

మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యానికి ఆయన ఆరోగ్యం సహకరించడంలేదని సమాచారం. గత నెల 28న కోవిడ్‌తో నర్సింహారెడ్డి సిటీ సెంటర్ హాస్పిటల్‌లో...

నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమం!

హైదరాబాద్: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యానికి ఆయన ఆరోగ్యం స్పందించడంలేదని సమాచారం. గత నెల 28న కోవిడ్‌తో నర్సింహారెడ్డి సిటీ సెంటర్ హాస్పిటల్‌లో చేరారు. కోవిడ్ నుంచి కోలుకున్న వెంటనే ఊపిరితిత్తుల సమస్యలతో అపోలో హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఊపిరితిత్తులు, కిడ్నీల సమస్యల తీవ్రంకావడంతో ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. గత పదిరోజులుగా నాయిని కళ్లు తెరవలేదని తెలుస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో సహా పలువురు టీఆర్ఎస్ నేతలు నాయిని కుటుంబాన్ని పరామర్శించారు. 



Updated Date - 2020-10-22T03:57:35+05:30 IST