బైరాన్‌పల్లి బలిదానాన్ని ఏటా స్మరించుకోవాలి

ABN , First Publish Date - 2021-08-28T01:52:23+05:30 IST

నిజాం రజాకార్లతో పోరాడి అసువులు బాసిన బైరాన్‌పల్లి వీరుల బలిదానాన్ని తేదీల వారీగా

బైరాన్‌పల్లి బలిదానాన్ని ఏటా స్మరించుకోవాలి

సిద్దిపేట/బైరాన్‌పల్లి: నిజాం రజాకార్లతో పోరాడి అసువులు బాసిన బైరాన్‌పల్లి వీరుల బలిదానాన్ని తేదీల వారీగా స్మరించుకోవాల్సిన అవసరం ఉందని మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని బైరాన్‌పల్లి, కూటిగల్‌ అమరవీరులకు సామూహిక పితృయజ్ఞం పిండ ప్రధానం కార్యక్రమాన్ని బైరాన్‌పల్లి బురుజు వద్ద నిర్వహించారు. అనంతరం స్థానిక స్వాతంత్ర్య వీర యోధులను సత్కరించారు. బురుజు చుట్టూ  ప్రదక్షిణలు చేసి అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.


1948 ఆగస్టు 27న రజాకార్లతో జరిగిన పోరాటంలో ఈ రెండు గ్రామాలకు చెందిన దాదాపు 118 మంది మరణించడం ఎంతో బాధాకరమైందన్నారు. మరో జలియన్ వాలాబాగ్‌గా ఈ సంఘటన చరిత్రలో నిలిచిపోయిందన్నారు. 73 సంవత్సరాలు పూర్తయిన ఈ బలిదానాన్ని ఇకనైనా తేదీ వారీగా స్మరించుకునే ప్రయత్నం చేయాలన్నారు. బైరాన్‌పల్లి గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా ప్రభుత్వాలు గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బండి శ్రీనివాస్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-08-28T01:52:23+05:30 IST