ఎగుమతుల్లో సర్టిఫికెట్‌ కోర్సు

ABN , First Publish Date - 2020-11-20T06:48:16+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ఎగుమతులు, దిగుమతుల మేనేజ్‌మెంట్‌లో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సును అందించనుంది...

ఎగుమతుల్లో సర్టిఫికెట్‌ కోర్సు

  • చేతులు కలిపిన తెలంగాణ, ఎఫ్‌టీసీసీఐ


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ఎగుమతులు, దిగుమతుల మేనేజ్‌మెంట్‌లో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సును అందించనుంది. డిసెంబరు 5న ఈ కోర్సు ప్రారంభమవుతుంది. కొవిడ్‌ సంక్షోభం వల్ల లభించిన అవకాశాలను భారత్‌ అందిపుచ్చుకోవాలని, అలాగే అనేక దేశాలు ఉత్పత్తుల కోసం భారత్‌ వైపు చూస్తున్నాయంటూ ఈ నేపథ్యంలో ఎగుమతులు, దిగుమతుల మేనేజ్‌మెంట్‌కు ప్రా ముఖ్యం పెరిగిందని ఎఫ్‌టీసీసీఐ తెలిపింది.


Updated Date - 2020-11-20T06:48:16+05:30 IST