నకిలీ ఇన్వాయిస్ లతో రూ. 34.6 కోట్లు మోసం

ABN , First Publish Date - 2020-09-24T09:25:59+05:30 IST

నకిలీ ఇన్వాయిస్ లతో రూ. 34.6 కోట్లు మోసం

నకిలీ ఇన్వాయిస్ లతో రూ. 34.6 కోట్లు మోసం

ఓ కంపెనీ స్థాపించి ఎలాంటి లావాదేవీలూ చేయకుండానే నకిలీ ఇన్వాయి్‌సలు సృష్టించి రూ. 34.6 కోట్లు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)ను క్లెయిమ్‌ చేసిన ఓ రియల్‌ ఎస్టేట్‌, పైపుల కంపెనీ వ్యవహారాన్ని హైదరాబాద్‌లోని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎ్‌సటీ ఇంటలిజెన్స్‌ (డీజీజీఐ) అధికారులు బట్టబయలు చేశారు. ఆ కంపెనీ డైరెక్టర్‌ను అరెస్టు చేశారు. పుణె, ముంబై, చెన్నై, కర్నూల్‌, హైదరాబాద్‌ వంటి చోట్ల ఐటీ/ఐటీఈఎస్‌, రియల్‌ ఎస్టేట్‌, బొగ్గు సరఫరా వంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్న పీసీసీపీ, బీడబ్ల్యూసీ పైపుల కంపెనీ లావాదేవీలు చేయకుండానే రూ.139.93 కోట్ల విలువైన ఇన్వాయి్‌సలను జారీ చేసి, రూ.19.7 కోట్ల ఐటీసీని క్లెయిమ్‌ చేసింది. ఇదేవిధంగా మరో రూ. 98.48 కోట్లు విలువైన నకిలీ ఇన్వాయి్‌సలు సృష్టించి మరో రూ. 14.9 కోట్లకు ఐటీసీని క్లెయిమ్‌ చేసింది. ఈ విషయమై సమాచారం అందడంతో డీజీజీఐ అధికారులు హైదరాబాద్‌లోని నాలుగు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించి ఈ నకిలీ సంస్థ గుట్టును రట్టు చేశారు. నకిలీ ఇన్వాయి్‌సలకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు బ్యాంక్‌ అకౌంట్‌లను ఫ్రీజ్‌ చేశారు. 

Updated Date - 2020-09-24T09:25:59+05:30 IST