కువైట్‌లో వాళ్లకు మాత్రమే ఫ్యామిలీ వీసా నుంచి వర్క్ పర్మిట్ ట్రాన్స్‌ఫర్
ABN , First Publish Date - 2020-12-17T13:57:20+05:30 IST
నాలుగు కొత్త కేటగిరీల వారికే మాత్రమే ఫ్యామిలీ వీసా(ఆర్టికల్ 22) నుంచి వర్క్ వీసా(ఆర్టికల్ 18) ట్రాన్స్‌ఫర్ ఉంటుందని కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ వెల్లడించింది.
కువైట్ సిటీ: నాలుగు కొత్త కేటగిరీల వారికే మాత్రమే ఫ్యామిలీ వీసా(ఆర్టికల్ 22) నుంచి వర్క్ వీసా(ఆర్టికల్ 18) ట్రాన్స్‌ఫర్ ఉంటుందని కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ వెల్లడించింది. కువైటీ మహిళల పిల్లలు, భర్తలకు.. కువైటీ భార్యలు(కువైట్‌లో జన్మించిన వారు).. ధృవపత్రాలు కలిగిన పాలస్తీనియన్లు.. డిప్లమా క్వాలిఫికేషన్, ఆపై సెకెండరీ స్కూల్ లేదా కువైట్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి హయ్యర్ ఉన్నవాళ్లకీ.. హెల్త్ విభాగంలో టెక్నికల్ ప్రొఫెషన్స్‌లో స్పెషలైజేషన్ ఉన్నవారికీ(మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అప్రూవల్ తప్పనిసరి).. ఈ కేటగిరీల వారికే మాత్రమే వీసా ట్రాన్స్‌ఫర్ ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.