Abn logo
Oct 18 2020 @ 03:47AM

పాక్‌ పేసర్‌ ఉమర్‌ గుల్‌ వీడ్కోలు

కరాచీ: పాకిస్థాన్‌ వెటరన్‌ పేసర్‌ ఉమర్‌ గుల్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం అతను నేషనల్‌ టీ20 కప్‌లో ఆడుతున్నాడు. అయితే ఈ టోర్నీలో తానాడుతున్న బలూచిస్థాన్‌ జట్టు ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించడంతో.. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి గుల్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 2003లో పాక్‌ తరఫున గుల్‌ అరంగేట్రం చేశాడు. 36 ఏళ్ల గుల్‌ తన చివరి వన్డే, టీ20 మ్యాచ్‌లను 2016లో ఆడగా, ఆఖరి టెస్టును 2013లోనే ఆడేశాడు. 130 వన్డేల్లో 179 వికెట్లు, 60 టీ20ల్లో 85 వికెట్లు తీసిన గుల్‌.. 47 టెస్టుల్లో 163 వికెట్లు పడగొట్టాడు.