అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-14T09:03:48+05:30 IST

అప్పులు మరో రైతును బలితీసుకున్నాయి. విజయనగరం జిల్లా జామికి చెందిన రైతు పిల్లా ఎర్నాయుడు(28) వేరొకరికి చెందిన ఎకరా 50సెంట్ల పొలంలో కూరగాయలు, చెరుకు సాగుచేస్తున్నాడు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

శృంగవరపుకోట రూరల్‌ (జామి) జనవరి 13: అప్పులు మరో రైతును బలితీసుకున్నాయి. విజయనగరం జిల్లా జామికి చెందిన రైతు పిల్లా ఎర్నాయుడు(28)  వేరొకరికి చెందిన ఎకరా 50సెంట్ల పొలంలో కూరగాయలు, చెరుకు సాగుచేస్తున్నాడు. కొన్నేళ్లుగా వ్యవసాయం కలసి రాకపోయినా వేరే పని చేయలేక సాగునే నమ్ముకున్నాడు. పెట్టుబడి కోసం రూ.10లక్షలు అప్పుతెచ్చాడు. ఈ ఏడాది పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. అప్పుల బాధకు తోడు... కుటుంబ పోషణ భారం కావడం, మరోవైపు తల్లికి  వైద్యం చేయించలేకపోతున్నాననే బాధ కూడా ఆయన్ను వెంటాడింది. మనస్తాపంతో మంగళవారం  పొలం వద్ద పురుగు మందు తాగి అపస్మారక స్థితికి వెళ్లాడు. చుట్టుపక్కల వారు గమనించి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో ఎస్‌.కోట సీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.  

Updated Date - 2021-01-14T09:03:48+05:30 IST