Abn logo
Feb 23 2021 @ 01:24AM

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

మహబూబాబాద్‌ రూరల్‌, ఫిబ్రవరి 22: అప్పు తెచ్చి సాగు చేసిన మిర్చి పంట తెగుళ్ల బారిన పడడంతో, అప్పులు తీర్చేమార్గం లేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్‌ జిల్లా వీఎ్‌సలక్ష్మీపురం గ్రామశివారు కేశ్యతండాకు చెందిన బానోత్‌ బాలు(48) రెండు ఎకరాల్లో పంట పెట్టుబడి కోసం రూ.4లక్షలు అప్పులు తెచ్చి మిర్చి సాగు చేశాడు. పంట తెగుళ్ల బారిన పడి, దిగుబడి తగ్గడంతో పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. దీంతో అప్పులు ఎలా తీర్చాలన్న మనోవేదనతో సోమవారం తోటకు పిచికారి చేసేందుకు తెచ్చిన పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

Advertisement
Advertisement
Advertisement