ఏపీలో భూ సేకరణను వ్యతిరేకిస్తున్న రైతులు

ABN , First Publish Date - 2020-02-22T22:31:58+05:30 IST

అమరావతి: ఉగాది నాటికి రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఏపీలో భూ సేకరణను వ్యతిరేకిస్తున్న రైతులు

అమరావతి: ఉగాది నాటికి రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లాల్లో స్థలాలు గుర్తించాలని ప్రభుత్వం రెవెన్యూ అధికారులను ఆదేశించింది. పలు ప్రాంతాల్లో భూములు లేకపోవడంతో పట్టాభూములను బలవంతంగా సేకరిస్తోంది. సారవంతమైన, మంచి పంటలు పండుతున్న భూములను కూడా వదలడంలేదు. అయితే తాము భూములను ఇచ్చేది లేదని రైతులు చెబుతున్నా.. అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. కృష్ణాజిల్లాలో భూ సేకరణను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వానికి తమ భూములు ఇచ్చేదిలేదని స్పష్టం చేస్తున్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. తమ భూములు బలవంతంగా తీసుకోవద్దని రైతులు వేడుకుంటున్నారు.

Updated Date - 2020-02-22T22:31:58+05:30 IST