అప్పుడు బ్లడీ ఇండియన్స్‌ అన్నారు..!

ABN , First Publish Date - 2021-06-10T10:11:39+05:30 IST

ఇంగ్లండ్‌ క్రికెటర్‌ ఒలీ రాబిన్‌సన్‌ ఉదంతంతో క్రికెట్‌లో జాతి వివక్షపై పెద్ద ఎత్తున చర్చ రేగుతోంది. ఇంగ్లండ్‌లో ఆసియా క్రికెటర్ల పట్ల చూపే వివక్షను టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ ఫరూక్‌ ఇంజినీర్‌...

అప్పుడు బ్లడీ ఇండియన్స్‌ అన్నారు..!

  • ఐపీఎల్‌ వచ్చాక బూట్లు నాకుతున్నారు
  • ఫరూక్‌ ఇంజినీర్‌


న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌ క్రికెటర్‌ ఒలీ రాబిన్‌సన్‌ ఉదంతంతో క్రికెట్‌లో జాతి వివక్షపై పెద్ద ఎత్తున చర్చ రేగుతోంది. ఇంగ్లండ్‌లో ఆసియా క్రికెటర్ల పట్ల చూపే వివక్షను టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ ఫరూక్‌ ఇంజినీర్‌ మరోసారి లేవనెత్తాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత ఆటగాళ్లు విద్వేష పూరిత వ్యాఖ్యలను వింటూనే ఉంటుంటారని చెప్పాడు. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ జెఫ్రీ బాయ్‌కాట్‌ ‘బ్లడీ ఇండియన్స్‌’ అనడంపైనా ఫరూక్‌ స్పందించాడు. ‘ఇది సాధారణం. ఇందులోకి కేవలం బాయ్‌కాట్‌ ఒక్కడినే లాగాలనుకోవడం లేదు. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. వాళ్లు నోటితో అనకపోయినా.. ఆలోచనలు మాత్రం అలాగే ఉంటాయి. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో కూడా కొంత మంది అలాంటి వారున్నార’ని చెప్పాడు. ఐపీఎల్‌ రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నాడు. భారత క్రికెటర్లపట్ల వ్యవహరించే తీరు కూడా మారిందని చెప్పాడు. ‘ఒకప్పుడు మనల్ని బ్లడీ ఇండియన్స్‌ అనే వాళ్లు. ఎప్పుడైతే కాసులు కురిపించే ఐపీఎల్‌ మొదలైందో.. డబ్బు కోసం వాళ్లు మన బూట్లు నాకడం మొదలుపెట్టారు. కానీ, వాళ్ల అసలు రంగేంటో నాలాంటి వాళ్లకు తెలుసు. ఉన్నట్టుండి వాళ్ల స్వరం మారింది. డబ్బు ఆర్జించేందుకు భారత్‌ వారికి గొప్ప దేశంగా మారింద’ని ఇంజినీర్‌ అన్నాడు. 


Updated Date - 2021-06-10T10:11:39+05:30 IST