హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): గ్రాన్యూల్స్ ఇండియా మెటాఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ ఎక్స్‌టెండెడ్ రిలీజ్ టాబ్లెట్లకు యూఎస్ ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చింది. కంపెనీ సమర్పించిన ఏఎన్‌డీఏకు తుది అనుమతి లభించినట్లు వెల్లడించింది. 500 ఎంజీ, 1000 ఎంజీ మోతాదుల టాబ్లెట్లను గ్రాన్యూల్స్ విక్రయిస్తుంది.