Abn logo
Jun 17 2021 @ 12:32PM

మహారాష్ట్రాలో బాణసంచా పరిశ్రమలో అగ్నిప్రమాదం

పాల్ఘార్ (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో గురువారం బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. పాల్ఘార్ జిల్లా దాహాను జాతీయరహదారి వద్ద ఉన్నవిషాల్ ఫైర్ వర్క్స్ బాణసంచా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఫ్యాక్టరీ అటవీప్రాంతానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అగ్నిప్రమాదంతో మంటలు ఎగసిపడుతుండటంతో అగ్నిమాపక వాహనాలు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి మంటలను ఆర్పుతున్నారు. ఈ అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. ఈ అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. 

క్రైమ్ మరిన్ని...