మోదీ విమానం ఫస్ట్‌ లుక్‌ రెడీ.. అంచనా వ్యయం 8,458 కోట్లు

ABN , First Publish Date - 2020-06-05T14:09:49+05:30 IST

దేశంలోని అగ్రశ్రేణిలో ఉన్న ముగ్గురు వీవీఐపీలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరచూ ప్రయాణించే విమానాల జాబితాలో క్షిపణి దుర్బేధ్యమైనవి చేరనున్నాయి.

మోదీ విమానం ఫస్ట్‌ లుక్‌ రెడీ.. అంచనా వ్యయం 8,458 కోట్లు

క్షిపణి దుర్భేద్యంగా రూపకల్పన 

మోదీ, కోవింద్‌, వెంకయ్య కోసం..

సిద్ధమవుతున్న 2 బోయింగ్‌-777 విమానాలు

అధునాతన రక్షణ వ్యవస్థ వీటి ప్రత్యేకత

ఆగస్టు చివరికల్లా అందుబాటులోకి ఒక విమానం

న్యూఢిల్లీ, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): దేశంలోని అగ్రశ్రేణిలో ఉన్న ముగ్గురు వీవీఐపీలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరచూ ప్రయాణించే విమానాల జాబితాలో క్షిపణి దుర్బేధ్యమైనవి చేరనున్నాయి. వీటికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ గురువారం విడుదలైంది. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్‌ వన్‌కు దీటైన విధంగా ఈ విమానాలు భద్రత కల్పిస్తాయి.రూ. 8,458 కోట్లు అంచనా వ్యయంతో తెప్పిస్తున్న ఈ విమానాల్లో ఉండే మిసైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ (ఎండీఎస్‌) ఖరీదే సుమారు రూ. 1,435.19 కోట్లుగా ఉంది.


ఈ విమానం ముందు భాగంలో పైన శక్తిమంతమైన ఈడబ్ల్యూ జామర్‌ ఉంటుంది. మూడు చోట్ల యూహెచ్‌ఎ్‌ఫ/వీహెచ్‌ఎఫ్‌ యాంటినాలు ఉంటాయి. రెక్కలకు ముందు భాగంలో ‘మిర్రర్‌ బాల్‌ ఈక్వలెంట్‌ సిస్టం’ను అమరుస్తారు. తోక భాగంలో క్షిపణి హెచ్చరిక వ్యవస్థ, డైరెక్షనల్‌ ఇన్‌ఫ్రారెడ్‌ కౌంటర్‌ మెజర్‌ సిస్టం (డీఐఆర్‌సీఎం) నిరంతరం నిఘా పెడతాయి. మూడేళ్ల క్రితం కొనుగోలు చేసిన రెండు బోయింగ్‌ 777-300ఈఆర్‌విమానాలకు అమెరికా సహకారంతో అత్యంత పటిష్ఠ భద్రతను జోడిస్తుండగా.. మొదటి విమానం ఆగస్టు చివరికల్లా, రెండోది సెప్టెంబరులో రానున్నాయి.


ప్రత్యేకతలు..

ఈ విమానాల్లో అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉంటాయి. క్షిపణి దాడులను ముందుగానే పసిగట్టే రాడార్లు, ఇన్‌ఫ్రారెడ్‌తో పనిచేసే స్వీయ-రక్షణ కవచాల (ఎస్‌పీఎస్‌)తో అత్యంత భద్రత ఉంటుంది.


ప్రస్తుతం పాతికేళ్ల క్రితం నాటివి..

ప్రస్తుతం వీవీఐపీల కోసం ఎయిర్‌ ఇండియా బోయింగ్‌-747 సిరీ్‌సకు చెందిన ఆరు విమానాలున్నాయి. ఇవి పాతికేళ్ల క్రితం కొనుగోలు చేసినవి.  

Updated Date - 2020-06-05T14:09:49+05:30 IST