టాప్‌ 10లో ఐదు మారుతి కార్లే

ABN , First Publish Date - 2021-04-14T06:25:54+05:30 IST

దేశంలో అధికంగా అమ్ముడుపోతున్న టాప్‌ 10 కార్లలో మారుతీ సుజుకి కంపెనీకి చెందినవి ఐదు కార్లున్నాయి. అవి స్విఫ్ట్‌, బాలెనో, వాగన్‌-ఆర్‌, ఆల్టో, డిజైర్‌. ఇలా ఐదు మారుతి కార్లు టాప్‌ 10లో స్థానం సంపాదించడం వరుసగా ఇది నాలుగో ఏడాది

టాప్‌ 10లో ఐదు మారుతి కార్లే

న్యూఢిల్లీ: దేశంలో అధికంగా అమ్ముడుపోతున్న టాప్‌ 10 కార్లలో మారుతీ సుజుకి కంపెనీకి చెందినవి ఐదు కార్లున్నాయి. అవి స్విఫ్ట్‌, బాలెనో, వాగన్‌-ఆర్‌, ఆల్టో, డిజైర్‌. ఇలా ఐదు మారుతి కార్లు టాప్‌ 10లో స్థానం సంపాదించడం వరుసగా ఇది నాలుగో ఏడాది. 1.72 లక్షల అమ్మకాలతో స్విఫ్ట్‌ ప్రథమ స్థానంలో నిలవగా 1.63 లక్షలతో బాలెనో రెండు, 1.28 లక్షలతో వాగన్‌-ఆర్‌ మూడు స్థానాల్లో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మారుతి కంపెనీ అమ్మిన కార్లలో ఈ మూడింటి వాటా 30 శాతం. గట్టి పోటీలో కూడా తాము ఈ ఘనత సాధించగలిగామని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ అన్నారు. 

Updated Date - 2021-04-14T06:25:54+05:30 IST