రఘురామరాజుకు మద్దతుగా ఫ్లెక్సీ

ABN , First Publish Date - 2021-05-15T09:45:46+05:30 IST

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు వాసులు నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం..

రఘురామరాజుకు మద్దతుగా ఫ్లెక్సీ

చేబ్రోలు,  మే 14: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు వాసులు నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆయనకు నారాకోడూరు ప్రాంతంతో ఎటువంటి అనుబంధం గానీ, సంబంధం కానీ లేదు. అయినప్పటికీ శుక్రవారం ఆయన ఫ్లెక్సీ పెట్టడం విశేషం. వైసీపీకి చెందిన ఎంపీ అయినప్పటికీ రఘురామరాజు కొంతకాలంగా సొంత పార్టీ నేతలను, సీఎం జగన్‌ను టార్గెట్‌ చేస్తూ తీవ్రస్ధాయిలో విమర్శిస్తున్నారు. ఇటీవల స్థానిక మాజీ ఎమ్మేల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ పై ఏసీబీ నమోదు చేసిన కేసు, అరెస్టు అక్రమమంటూ ఆయనకు బాహాటంగానే మద్దతు పలికారు. బహుశా దీనివల్లే  నారాకోడూరు యూత్‌ రఘురామరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్సీ పెట్టి ఉంటారని అనుకుంటున్నారు. ప్రధాన రహదారి వెంట ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో ఇతర అంశాలు లేనప్పటికి.. అటు ప్రయాణించే ప్రతి ఒక్కరూ ఆగి దానిని ఆసక్తిగా తిలకించి వెళ్తున్నారు.


Updated Date - 2021-05-15T09:45:46+05:30 IST