Abn logo
Aug 11 2021 @ 20:31PM

సాగర్‌ జలాశయానికి పెరిగిన వరద

నాగార్జునసాగర్‌: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద రాక పెరగటంతో ఎనిమిది క్రస్ట్‌ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ నెల 1వ తేదీ నుంచి సాగర్‌ క్రస్ట్‌ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత మూడు రోజులుగా సాగర్‌కు వరద రాక స్వల్పంగా తగ్గడంతో నాలుగు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు బుధవారం ఉదయం నుంచి వరద రాక పెరగడంతో ఎనిమిది క్రస్ట్‌గేట్ల నుంచి నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. సాగర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా, కాగా ప్రస్తుతం 589.70 అడుగులు (311.1486 టీఎంసీలు)గా నమోదైంది.